కాకినాడలో మూడో బెటాలియన్ కానిస్టేబుల్ వంశీకి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. అప్పటికే మహిళా కానిస్టేబుల్ వంశీపై రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వంశీ పిఎస్‌కు పిలిచి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు.మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహించడంతో అర్థరాత్రి రోడ్‌కమ్ రైలు వంతెన పైనుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.అప్పటికే పరిచయం ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ పెళ్లి చేసుకోవాలని వంశీని ఒత్తిడి చేస్తోందని, ఆమెను పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం పోతుందని పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారని వంశీ తండ్రి ఆరోపణలు చేశాడు.