హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలోలిక్కర్ ప్లాంట్ సమీపంలో గత ఐదేళ్లుగా నివసిస్తున్న సుమారు 360 కుటుంబాల గుడిసెలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగించడం ప్రారంభించారు. నిన్ననే ఈ గుడిసెవాసులు తమకు న్యాయం చేయాలంటూ హన్మకొండ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆ మరుసటి రోజే అధికారులు ఈ ఆకస్మిక చర్యకు దిగడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.