బెంగళూరు-పుణె జాతీయ రహదారిలో చిరుత రోడ్డు దాడుతుండగా గుర్తు తెలియని వాహనం దానిని ఢీకొట్టడంతో అది తీవ్రంగా గాయపడింది. రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోయింది.అటవీ శాఖ ఉద్యోగి మరుళ సిద్దప్ప చిరుతకు దగ్గర నుంచి మత్తుమందు ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా అతడిపై చిరుత దాడి చేయడంతో మిగిలిన సిబ్బంది అతడిని రక్షించారు. అనంతరం దూరం నుంచి చిరుతకు మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. చిరుతకు నడుము భాగంతో తీవ్ర గాయలైనట్టు అటవీశాఖ అధికారులు, వెటర్నరీ వైద్యులు తెలిపారు.