భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మాత్రం వినాయకుడికి భక్తులు వినూత్నంగా నైవేద్యం సమర్పిస్తున్నారు. సాధారణంగా గణేశుడికి మోదకాలు, లడ్డూలు వంటి మిఠాయిలను నైవేద్యంగా పెట్టడం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం ‘బోబా టీ’గా పిలిచే బబుల్ మిల్క్ టీని గణేశుడికి సమర్పిస్తున్నారు. ఒక్కొక్కరు వందల సంఖ్యలో బోబా టీ కప్పులను కూడా నైవేద్యంగా పెట్టే సందర్భాలు ఉంటాయని పేర్కొన్నారు.