నగరంలోని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ప్రమాదవశాత్తు భారీ ప్రమాదం చోటుచేసుకుంది. 2వ అంతస్తులోని చెక్ సెక్షన్లో భారీగా మంటల చెలరేగడంతో పలు కీలకమైన డాక్యూమెంట్లు దగ్ధం అయినట్లు తెలుస్తోంది. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.