సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ల చోరీ స్థానికంగా సంచలనం సృష్టించినది. గ్యాస్ కొరతను క్యాష్ చేసుకునేందుకు దొంగలు రూట్ మార్చారు. కోహీర్ లోనీ మనీషా గ్యాస్ ఏజెన్సీ గోదాంలో నుండి 82 సిలిండర్లు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు గ్యాస్ ఏజెన్సీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం రాత్రి గోడౌన్ లోని 50 కమర్షియల్ నిండు సిలిండర్లు, 32 ఖాళీ సిలిండర్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు.
గ్యాస్ సిలిండర్ల చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

