బ్రెజిల్ దేశంలోని సావో పాలో (Sao Paulo) రాష్ట్రంలో ఓ ఘోర విమాన ప్రమాదం జరిగింది. బ్రెజిలియన్ సంస్థ ‘Voepass’కు చెందిన ATR 72-500 విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగా గాల్లో చక్కర్లు కొట్టిన విమానం ఒక్కసారిగా భవనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో విమాన సిబ్బందితో పాటు 68 మంది ప్రయాణికులు మృతిచెందారు.

