కేరళలో పోలింగ్ ముగిసిపోయి నాలుగు రోజులవుతున్నా ఇంకా ఈసీ వివరాలు బయటపెట్టకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీషన్ ఎన్నికల సంఘానికి ఇవాళ లేఖ రాశారు. ఇందులో ఆయన.. శాసనసభ ఎన్నికల పోలింగ్ శాతం వివరాలను వెంటనే విడుదల చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను కోరారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి, పోలింగ్ శాతం, పోస్టల్ ఓటింగ్ స్టేటస్ కు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని కూడా వీడీ సతీషన్ డిమాండ్ చేశారు.

