తిరుమల శ్రీవారినే ప్రధానంగా నమ్మే ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ లడ్డూ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలరని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. కల్తీ లడ్డూ వ్యవహారాన్ని అంతిమంగా నడిపించిన వారెవరో తేలాల్సిందే అన్నారు. కుప్పం పర్యటన ముగించుకుని వచ్చాక కల్తీ లడ్డూ వ్యవహారంపై సీరియస్ చర్యలే తీసుకుంటారని తెలిపారు. తిరుమలలో ప్రక్షాళన కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు. కల్తీ లడ్డూ వ్యవహారంలో ఇంకా చాలా అంశాలు బయటకు రావాల్సి ఉందని వెల్లడించారు. సీఎం చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే అన్నారు.

