వినాయకుడి పండుగ దగ్గర పడుతుండటంతో రైలు ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలో రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త రికార్డు నమోదైంది. IRCTC ప్రకారం.. సెప్టెంబర్ 7న మొత్తం 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. ఒక్క రోజులో 20 లక్షల టికెట్ల మార్క్ దాటడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 8న కూడా బుకింగ్స్ భారీగానే కొనసాగాయి. ఆ రోజు 19,50,699 టికెట్లు బుక్ అయ్యాయి. ప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్‌లైన్‌లోనే బుక్ అవుతున్నాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది.