మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, ప్రీతమ్ లోధి కుమారుడు దినేష్ లోధి, తన థార్ వాహనంతో బైక్పై వెళ్తున్న ముగ్గిరిని బలంగా ఢీకొట్టి ఆ తర్వాత అదే వేగంతో రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళలను కూడా కారు చిదిమేసింది ప్రమాద తీవ్రతకు ఐదుగురు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. మంత్రి కుమారుడు మాత్రం “నేను సైరన్ మోగించాను, హారన్ కొట్టాను.. అయినా వాళ్లు ఎందుకు ఆగలేదు? ముగ్గురు కలిసి బైక్పై వెళ్తూ చేతులు ఊపడం వల్లే ఇలా జరిగింది” అంటూ బాధితులనే నిందించడం వీడియోలో రికార్డైంది

