నియోజకవర్గాల పునర్విభజన తర్వాత లోక్సభలో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫైరయ్యారు. డీలిమిటేషన్తో తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాలు 26కు పెరుగుతాయని.. అలాగే ఎపిలో ఉన్న 25 స్థానాలు 38కి పెరుగుతాయన్నారు. కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు.

