ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న హింసాత్మక వాతావరణం ,నిరంకుశ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్( NHRC ) కు బుధవారం ఫిర్యాదు చేశారు. . ఈమేరకు ఛైర్మన్ జస్టిస్ సుబ్రహ్మణ్యంను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై ఇటీవల జరిగిన దాడులు , వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త సల్మాన్ రాజు దారుణ హత్యను చైర్మన్‌కు వివరించారు. ఈ సందర్భంగా వీడియోలు, ఫోటోల రూపంలో సాక్ష్యాలను సమర్పించారు.

