సొంత కుటుంబమే తనను బయటకు పంపిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. పాంచజన్య సంకల్ప సభలో కవిత మాట్లాడుతూ.. జిల్లాలో బిఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి కుట్ర చేసి తనను ఓడగొట్టారని అన్నారు. “ఏం తప్పు చేశానని నన్ను తీహాడ్ జైలులో పెట్టారు?. ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే అక్కున చేర్చుకోవాల్సింది పోయి కర్కశంగా నన్ను బయటకు పంపారు. అమ్మ ఇంటివాళ్లు నిర్దాక్ష్యణ్యంగా తరిమేస్తే అత్తింటి వాళ్లు కన్న బిడ్డలా నన్ను అక్కున చేర్చుకున్నారు.

