నానక్‌రామ్‌గూడ కేంద్రంగా తొమ్మిదేళ్లుగా గంజాయి దందా సాగిస్తున్న మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డాన్ నీతూ బాయిని ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులే లక్ష్యంగా ఈమె 2017 నుంచి నెట్వర్క్ నడుపుతూ గంజాయి విక్రయిస్తోంది. ఏకంగా 13 కేసుల్లో పరారీలో ఉంటూ పోలీసుల కళ్లుగప్పుతున్న నీతూ బాయిని ఈగల్ ఫోర్స్ టెక్నికల్ టీమ్ పక్కా నిఘాతో మంగళ్‌హాట్ వైపు ఆటోలో వెళ్తుండగా పట్టుకుంది. గంజాయి విక్రయాల డబ్బుతో గచ్చిబౌలి, లంగర్ హౌస్‌లలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించినట్లు పోలీసుల విచారణలో తేలింది.