రీకౌంటింగ్ వివాదం నడుమ గన్నవరం వైసీపీ కైవసం: కృష్ణా జిల్లా గన్నవరం జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి, వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడైన అనగాని రవి విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన సమీప ప్రత్యర్థిపై 137 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఫలితంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్ నిర్వహించాలని కూటమి నేతలు తీవ్రస్థాయిలో పట్టుబట్టడంతో కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు కౌంటింగ్ సెంటర్ తలుపులు మూసివేశారు.