ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో తూర్పు ఇంగ్లండ్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్) మిల్డెన్‌హాల్ స్థావరం నుంచి అమెరికా తన గగనతల ఇంధన ట్యాంకర్ విమానాలను తరలించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. 100వ రీఫ్యూయలింగ్ వింగ్‌కు నిలయమైన ఈ బేస్ నుంచి రెండు కెసి-135 స్ట్రాటోట్యాంకర్ విమానాలను జర్మనీకి తరలించగా, మరికొన్నింటిని యూరప్‌లోని ఇతర స్థావరాలకు పంపారు. 131 అడుగుల రెక్కల వెడల్పు ఉన్న ఈ నాలుగు ఇంజిన్ల జెట్ విమానం 83,000 పౌండ్ల కార్గోను మోయగలదు