కాకినాడ జిల్లా బొద్దవరంకి చెందిన బద్ధ రాజు, విజయనగరం జిల్లా నాగమణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ ఇన్‌ఫ్లుయెన్సర్లుగా గుర్తింపు పొందారు. గత జూన్‌లో నాగమణి కనిపించకుండా పోయింది. అప్పటికి వారి పాప వయసు కేవలం నాలుగు నెలలు మాత్రమే. కొన్ని సందర్భాల్లో ఇంటి నుంచి వెళ్లిపోయి రెండు, మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చేదని రాజు చెబుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన నరసింహులు,షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తి తన భార్యకు పరిచయం ఉందని చెబుతున్నాడు.