కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి తమదేనని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆన్‌లైన్ ద్వారా కోర్టుకు ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 16న జరగనుండగా.. సీఎస్ శాంతికుమారి, ఆమె ఆధికారుల బృందం రెండు రోజులు ఢిల్లీలోనే మకాం వేశా రు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపుల జరిపిన అనంతరం సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు.

