ఏపీలోని ఉత్తరాంధ్రలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. గంటకు 50 కిలో
మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే
అవకాశం ఉందని పేర్కొంది.