తిరుమల లడ్డూ విషయంలో మహాపాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసిపి నేతలు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి వాసం శెట్టి సుభాష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో ఐదు కొండలంటూ గతంలో తిరుమల భక్తులను మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు.

