పీఎం కిసాన్ పథకం నగదు 20వ విడత నగదును ప్రధాని విడుదల చేశారు.ఆకార్యక్రమాన్ని చంద్రబాబు రైతులతో కలిసి వీరాయపాలెంలో నులక మంచాలపై కూర్చొని తిలకించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా ఏటా ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు కలిపి ఒక్కొక్కరికీ రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగానే తొలి విడత రూ.7 వేలను శనివారం రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.

