రాష్ట్ర రాజధానితో పాటు సంగారెడ్డి జిల్లాకు వరప్రదాయిని గా ఉన్న సింగూర్ ప్రాజెక్ట్, మంజీరా బ్యారేజీలు ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా మారుతున్నాయి. ఓ వైపు ఎండలు దంచి కొడుతుండటం,వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంటే… మరోవైపు గేట్ల లీకేజీల వల్ల రోజుకు లక్షలాది లీటర్ల విలువైన నీరు వృధాగా నది పాలవుతోంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించినా స్థానిక అధికారుల్లో చలనం లేకపోవడం పై ప్రజలు,రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.