అంబేద్కర్ జయంతి ఇవాళ. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పార్లమెంట్ ఆవరణలో నివాళి అర్పించారు. ప్రేరణా స్థల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ప్రగతిశీల సమాజం నిర్మాణం కోసం అంబేద్కర్ ఆశయాలు నిరంతరం ప్రేరణ కలిగిస్తాయని అన్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, స్పీకర్ ఓం బిర్లా కూడా నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా ప్రేరణా స్థల్ వద్ద నివాళి అర్పించారు.

