కూటమి అపచారానికి వైఎస్సార్సీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి రాంబాబు.. గోరంట్లకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆయన కారును అడ్డుకున్నారు. అనంతరం, రాడ్లు, కర్రలతో టీడీపీ నేతలు రాంబాబుపై దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై అంబటి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారు.ప్లాన్ ప్రకారమే నాపై దాడి యత్నం జరిగింది పోలీసులు ఏం చేస్తున్నారు’ అని ప్రశ్నించారు.

