సిబిఎస్ఇ 10వ తరగతి పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈసారి పరీక్షలలో మొత్తం 93.7 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. బాలికలలో మొత్తం 94.99 శాతం మంది పాసయ్యారు. ఈ సారి సిబిఎస్ఇ రెండు దఫాల బోర్డు పరీక్షలు నిర్వహించింది.ఉత్తీర్ణులైన వారిలో దాదాపు 55,368 మందికి 95 శాతం పైగా మార్కులు, రెండు లక్షల మందికి పైగా 90 శాతం పైగా మార్కులు సాధించారు.

