మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాల తీసుకుంటున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, ఆ పార్టీ సోషల్ మీడియా మాజీ ఇంఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి జగన్ కొత్త బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో భార్గవరెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ఏడాది ఆగస్టులో పార్టీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి భార్గవ రెడ్డిని తప్పించారు. ఇప్పుడు భార్గవ రెడ్డికి సాక్షి మీడియాలో డిజిటల్ హెడ్ గా నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

