ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు. నూలు పోగువొత్తులను ప్రకాశం జిల్లా వేటపాలం మండలం ఆమోదగిరిపట్నంకి చెందిన వసుందరరావు కుటుంబీకులతో వచ్చి ఆలయానికి అప్పగించడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు. ఈ జ్వాలాతోరణోత్సవాన్ని తిలకించి భస్మాన్ని నుదుటిన ధరించడంతో సకల గ్రహపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

