తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని ఊరందూరు హైవే రోడ్డుపై తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెస్ట్ బెంగాల్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న అంబులెన్స్ అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో మొత్తం ఆరుగురు ఉండగా, వారిలో ముగ్గురు పురుషులు ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.

