దక్షిణాది సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, నటుడు జీవా తండ్రి ఆర్బీ చౌదరీ దుర్మరణం చెందారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టిన ఘటనలో ఆర్బీ చౌదరీ మృతి చెందారు. అక్కడ ఒక పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. రాజా, నిన్నే ప్రేమిస్తా, సంక్రాంతి, నువ్వు వస్తావని, సుస్వాగతం, శివరామరాజు, రచ్చ, వంటి చిత్రాలను ఆర్బీ చౌదరీ నిర్మించారు.

