అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలోని హోలెనరసిపురలో ఉన్న ఫామ్‌హౌస్‌లో 47 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో శనివారం కోర్టు ఆయనకు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. రేవణ్ణ అరెస్టు అయిన దాదాపు 14 నెలల తర్వాత.. విచారణ ప్రారంభమైన ఎనిమిది వారాలలోపే న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ ఈ తీర్పును వెలువరించారు.

