రాజ్యసభలో బీజేపీలో ఏడుగురు ఆప్ ఎంపీల విలీనం అధికారికంగా పూర్తైంది. రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్… బీజేపీలోకి ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల విలీనాన్ని అధికారికంగా ఆమోదించారు. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం 113కు పెరిగింది. ఇటీవల ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే, పార్టీ ఫిరాయించిన ఆ ఏడుగురు ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ AAP ఆదివారం రాజ్యసభ ఛైర్మన్‌కు ఒక పిటిషన్‌ను సమర్పించింది.

