చైనా లోని హునాన్ ప్రావిన్సులో ఉన్న బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఆ పేలుడు వల్ల సుమారు 21 మంది మరణించారు. మరో 61 మంది గాయపడ్డారు. హువాషెంగ్ ఫైర్వర్క్స్ ప్లాంట్‌లో ఈ ఘటన జరిగింది. సోమవారం సాయంత్రం లియుయాంగ్ సిటీలో పేలుడు జరిగింది. బిల్డింగ్‌లో ట్రాప్ అయిన వారిని రక్షించేందుకు రోబోలను వాడారు.బాణాసంచా ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న రెండు గన్‌పౌడర్ వేరౌజ్ల వల్ల రెస్క్యూ ఆపరేషన్ మరింత ఇబ్బందికరంగా మారింది.

