వరల్డ్ కప్ ఛాంపియన్ రీచా ఘోష్‌పై వరాల జల్లు కురిసింది. భారత జట్టు విజయంలో కీలకమైన రీచాకు స్వరాష్ట్రం బెంగాల్‌లో ఘన స్వాగతంతో పాటు ఊహించని పదవి దక్కింది. శనివారం జరిగిన సన్మాన కార్యక్రమంలో వికెట్ కీపర్, బ్యాటర్‌ను డీఎస్పీగా నియమించింది బెంగాల్ ప్రభుత్వం. విశ్వ విజేతగా దేశం, రాష్ట్రం ఖ్యాతిని ఇనుమడింపజేసిన రీచాను సన్మాన వేడుకలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. తనదైన దూకుడుతో టీమిండియా చరిత్ర సృష్టించడంలో కీలకమైన రీచాకు స్వరాష్ట్రం బెంగాల్‌లో భారీ స్వాగతం లభించింది.

