రాష్ట్ర హోమ్ మినిష్టర్ సాధారణ రైతులా మారి పొలాల్లో వరినాట్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయనగరం జిల్లాలో పర్యటనలో భాగంగా గ్రామానికి వెళ్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు ప్రక్కన పొలంలో నాట్లు వేస్తున్న రైతులను చూసి వెంటనే ఆగారు. వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా అందరినీ పలకరించారు. అక్కడ నుండి అతికష్టం మీద పొలం గట్లపై నడుస్తూ పొలంలోకి దిగారు. తమతో కలిసి వరి నాట్లు వేయడం పట్ల రైతులు, కూలీలు హర్షం వ్యక్తం చేశారు

