హస్తిన యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. శనివారం కెటిఆర్ తన ట్విటర్ లో పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారని, ఈయన ఢిల్లీ యాత్రలకు తెలంగాణకు ఏ సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు ఉన్నాయని, మొదటి పని ఫ్లైటు టికెట్ బుక్ చేయడమని, రెండో పని ఢిల్లీకి పోవడమని, మూడో పని ఖాళీ చేతులతో తిరిగి రావడమని ఎద్దేవా చేశారు.

