పాకిస్థాన్లోని పెషావర్లో సోమవారం ఉదయం భద్రతా వ్యవస్థకు సవాలు విసురుతూ.. ఉగ్రవాదులు ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై భారీ ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా పారామిలటరీ కార్యాలయం ప్రధాన గేట్, సైకిల్ స్టాండ్ వద్ద భారీ పేలుడు సంభవించింది. రెండు వరుస పేలుళ్ల తర్వాత.. ఉగ్రవాదులు కార్యాలయం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయి భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు.

