ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే, జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (ఏప్రిల్ 30, 1870 – ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు. అతని ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర (భారతీయ మొదటి సినిమా) 1913. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు నిర్మించాడు. అతని పేరు మీద జాతీయ అవార్డుల సంరంభం ప్రతి యేటా జరుగుతున్నా, అతని జీవిత చరమాంకం ఎంతటి దైన్యావస్థలో గడిచిందో ఎవరూ తలచకపోవటం శోచనీయం.

