అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASAలో భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. NASAలో పనిచేస్తున్న 2,145 మంది సీనియర్ స్థాయి ఉద్యోగులు త్వరలో రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఇది సంస్థలో కొనసాగుతున్న సిబ్బంది తగ్గింపు చర్యల్లో భాగంగా జరుగుతోందని తెలుస్తోంది. ఈ రాజీనామాలు ఎక్కువగా GS-13 నుండి GS-15 స్థాయిలో ఉన్న సీనియర్ గవర్నమెంట్ ఉద్యోగులు నుంచే చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పరంగా వీరు అధిక బాధ్యతలు కలిగిన ఉద్యోగస్థాయి వారు.

