దాదాపు అన్ని సినిమాలు ప్రజల ఆదరణ పొందాయి. ఒకటి అరా అటు ఇటుగా ఉన్నా కూడా ఇది మంచి సంక్రాంతి” అన్న చిరంజీవి వ్యాఖ్యలు ఒకటి అరా అటు ఇటుగా’ అనే మాటలు రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ను ఉద్దేశించినవేనని కొందరు రవితేజ అభిమానులు భావించారు. దీంతో సోషల్ మీడియాలో చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. తమ హీరో సినిమా రిజల్ట్‌ను బహిరంగ వేదికపై ప్రస్తావించారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

