తెలంగాణలో ఆర్టీసి సమ్మె బాట పట్టనుంది. మంగళవారం ప్రభుత్వంతో టీజిఎస్ ఆర్టీసీ జేఏసీ చర్చలు జరిపింది. సచివాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఆర్ అధికారుల కమిటీతో దాదాపు 4 గంటలకుపైగా ఆర్టీసీ సంఘాలు చర్చలు జరిపాయి. అయితే, ఈ చర్చలు విఫలం కావడంతో ఈ అర్ధరాత్రి నుంచే టీజిఎస్ ఆర్టీసి సమ్మెకు వెళ్లనుంది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈక్రమంలో ప్రజా రవాణా స్తంభించే అవకాశం ఉంది.

