తమిళ రాజకీయాలను ఉద్దేశించి ఆయన పోస్ట్ చేసిన పాత ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన వెనుక నిలబడిన ఈ చిన్నారి (విజయ్), ఒకరోజు తన పార్టీని (DMK) నాశనం చేస్తాడని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు. ఈరోజు అదే వ్యక్తి ఆ పార్టీకి సవాల్ విసిరి, ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు అని వర్మ పేర్కొన్నారు. కరుణానిధి నీడలో ఒక సామాన్య యువకుడిగా కనిపించిన విజయ్, ఇప్పుడు రాజకీయ కోటను బద్దలు కొట్టడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

