ఒంగోలు నగరానికి చెందిన వెంకట రమణమ్మ అనే వృద్ధురాలి పెద్ద కుమారుడు కిషోర్ బాబు తల్లితోనే కలిసి నివసిస్తున్నాడు. కిషోర్ బాబు స్థానికంగా ఒక మాంసం దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.మంగళవారం ఉదయం తల్లి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. నిద్రలోనే ఉన్న ఆ తల్లి మంటల ధాటికి కేకలు వేసినా,అతడు ఏమాత్రం చలించకుండ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసరికి కేవలం అస్తిపంజరం మాత్రమే మిగిలింది.

