ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల చేసింది. కాగా, హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరస్సింగ్ ఠాకూర్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. శనివారం జస్టిస్ లీసాగిల్ ఏపీ హైకోర్టు సీజేగా వ్యవహరించనున్నారు. దీంతో ఏపీ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ చరిత్రకెక్కనున్నారు.

