ఇజ్రాయెల్ సేనలు ఆదివారం మరోసారి గాజాలోని రెండు అన్నార్థుల సహాయక కేంద్రాల వద్ద దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 27 మంది వరకూ మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. తిండి, మందులు మంచినీటి కోసం ఇక్కడికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చిన దశలోనే కాల్పులు జరిగినట్లు వెల్లడైంది. జిహెచ్‌ఎఫ్ కేంద్రాలకు అమెరికా నుంచి కూడా భారీ స్థాయిలో నిధులు అందుతున్నాయి.

