హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన ఇండిగో విమానంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం (మే 5) విమానం చండీగఢ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఒక ప్రయాణికుడి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మంటలను గమనించిన క్యాబిన్ సిబ్బంది తక్షణమే స్పందించి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అందరినీ విమానం నుంచి ఖాళీ చేయించి టెర్మినల్‌కు సురక్షితంగా తరలించారు.

