బిహార్ సీఎం పదవిని వదిలి నీతీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడాన్ని జేడీయూ పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. నీతీశ్ రాజ్యసభకు వెళ్లొద్దని, బిహార్ సీఎంగానే కొనసాగాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పట్నాలోని నీతీశ్ నివాసం వెలుపల నిరసన చేపట్టారు. బిహార్‌కు మరెవరూ సీఎంగా వద్దని, నీతీశే ఉండాలని నినాదాలు చేశారు. ఆయన అకౌంట్‌ను ఎవరైనా హైజాక్ చేసి ఉండొచ్చని అంటున్నారు. దీంతో బిహార్‌లో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది.

