వర్జీనియా స్టేట్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా భారత సంతతి మహిళా నేత గజాలా హష్మీ విజయం సాధించారు. ట్రంప్‌కు విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన గజాలా.. అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతికి చెందిన ముస్లిం మహిళగా గజాలా హష్మీ చరిత్ర సృష్టించారు గజాలా 1964న హైదరాబాద్ మలక్‌పేటలో జన్మించారు. ఆమెకు నాలుగు సంవత్సరాల వయసులో ఆమె తల్లి, అన్నయ్యతో కలిసి అమెరికాకు వెళ్లారు. ఆమె తాత ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఆమె కుటుంబం ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో ఉంది.

