అమెరికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కెంటకీలోని లూయిస్విల్లే ఎయిర్పోర్టులో UPS కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. దీంతో ఫ్లైట్ పేలిపోయి.. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయిఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో పలు భవనాలు దగ్దమయ్యాయి. విమానంలోని ముగ్గురు సిబ్బంది మృతి చెందగా.. మరో 11 మందికి గాయాలయ్యాయి.కార్గో విమానం 42వేల గ్యాలన్లు జెట్ ఇంధనాన్ని మోసుకెళ్తోన్న తెలుస్తోంది

