మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ అకస్మాత్తుగా మరణించడం దేశ రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అజిత్ పవార్ హఠాత్తుగా మరణించడంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర గురిచేసిందన్నారు. పవార్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఓం శాంతి అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

